నేరేడ్‌మెట్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదింపు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న నేరేడ్‌మెట్ పరిధిలోని శివనగర్ ప్రాంతంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును నిందితులు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 15న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని రిహాన్ అహ్మద్, మహమ్మద్ సోను, ఆసిఫ్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వీరు ఎల్బీనగర్‌లో నివాసం ఉంటూ ఎంబ్రాయిడరీ పని చేస్తున్నారు. జీతాలు తమ విలాసాలకు సరిపోకపోవడంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు మల్కాజిగిరి ఏసీపీ యాదగిరి తెలిపారు.
కేసు దర్యాప్తులో భాగంగా చోరీకి గురైన బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించినట్లు పోలీసులు తెలిపిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి ఏసీపీ యాదగిరి వెల్లడించారు.
బైట్: యాదగిరి, ఏసీపీ మల్కాజిగిరి
వీడియో గ్యాలరీ
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.