అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ స్థాయి ప్రతినిధుల మహాసభ.. విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు
బాన్సువాడ, అక్టోబర్ 4: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, నూతన ఎమ్మెస్‌ఎఫ్ (MSF) కమిటీల ఆధ్వర్యంలో అక్టోబర్ 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మాదిగ విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బాన్సువాడలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బాలుర సంక్షేమ హాస్టల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. MSF జిల్లా కో-ఇంచార్జ్ మెక్కా సాయి మాదిగ, మవురం శ్రీకాంత్ మాదిగ, MRPS నాసురుల్లాబాద్ మండల అధికార ప్రతినిధి ఎడ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అక్టోబర్ 6న జరగనున్న జాతీయ స్థాయి ప్రతినిధుల మహాసభకు మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అలాగే MSF నూతన కమిటీల్లో బాధ్యతలు చేపట్టిన వారందరూ కార్యక్రమానికి క్రమశిక్షణతో హాజరు కావాలని సూచించారు. కార్యక్రమానికి డ్రెస్ కోడ్‌గా నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా ధరించాలని పిలుపునిచ్చారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

