పోచారంలో మతసామరస్యానికి ప్రతీకగా విజయదశమి సంప్రదాయాలు

పోచారం, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన పూజలు చేసి, గ్రామంలోని ఆలయాలను సందర్శించారు.

ప్రతి సంవత్సరం విజయదశమి రోజున పోచారం కుటుంబం పాటించే సంప్రదాయంలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి జెండాను తీసుకువచ్చి, పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం సమీపంలోని మహబూబ్ సుభాని దర్గా వద్ద ఎగురవేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సంప్రదాయం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోంది.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి, శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ యువత ప్రతిష్ఠించిన దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

విజయదశమి సంప్రదాయంలో భాగంగా పాలపిట్టను కూడా పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పోచారం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పరిగె వెంకట్ రామ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి