బయ్యారం చెరువు అలుగు పారడంతో రైతుల్లో ఆనందం.. గార్ల చెరువు కూడా నిండాలని ఆకాంక్ష
బయ్యారం చెరువు అలుగు పారుతున్న శుభ సందర్భంలో రైతులు, పురప్రముఖులతో కలిసి గంగాదేవిని దర్శించుకోవడం ఆనందం, ఉత్సాహాన్ని ఇస్తున్న విషయమని పేర్కొన్నారు.
బయ్యారం చెరువులో కనిపిస్తున్న జలకళ కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదని, అన్నదాతల కష్టానికి, నమ్మకానికి దేవుడు ఇస్తున్న ప్రతిఫలంగా భావిస్తున్నట్లు తెలిపారు. కరువు కాటకాలను తరిమికొట్టి, నేలలను సుభిక్షం చేసేందుకు ప్రకృతి అందించిన అమూల్యమైన కానుకగా ఈ నీటిని అభివర్ణించారు.
భూములు సిరులు పండాలని ఆకాంక్ష
బయ్యారం చెరువు నుంచి వచ్చిన పవిత్ర జలాలతో భూములు సిరులు పండాలని, ప్రతి ఇంటిలోనూ ధాన్యం రాశులు నిండాలని మనసారా కోరుకోవాలని పిలుపునిచ్చారు.
గార్ల చెరువు కూడా నిండాలని ప్రార్థన
బయ్యారం చెరువు అలుగు పారినంత ఉత్సాహంగా గార్ల చెరువు కూడా కళకళలాడుతూ త్వరలోనే నిండాలని గంగాదేవిని వేడుకుందామని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, చెరువులన్నీ మత్తడి దూకితే గ్రామాలు పచ్చగా, సుభిక్షంగా ఉంటాయని పేర్కొన్నారు.
నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత
నీరు ప్రాణాధారమని, ప్రకృతి ప్రసాదించిన నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకుంటూ పొదుపుగా వినియోగించడం ద్వారా భావి తరాలకు భద్రత కల్పించగలమని తెలిపారు.
బయ్యారం చెరువు అలుగు ప్రవాహం రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రాంతమంతా పాడిపంటలతో కళకళలాడాలని గంగాదేవిని ప్రార్థిస్తూ “జై జవాన్.. జై కిసాన్” అంటూ సందేశాన్ని ముగించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.