సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ
ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి వైశ్య ప్రముఖులు తరలివెళ్లారు.
ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాలు కేటాయించిందని వారు పేర్కొన్నారు. ఈ స్థలంలో భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్ కి గౌడును స్థానిక ఆర్యవైశ్య సభ్యులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి వెళ్లిన వారిలో రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఓర విట్టల్ గుప్తా, కోశాధికారి గోరంటి సాయినాథ్ గుప్తాతో పాటు జిల్లా ప్రముఖులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.