బీబీపేటలో భారీ వర్షం.. రోడ్డుపై కూలిన చెట్లు, రాకపోకలకు అంతరాయం
బీబీపేట మండలంలో ఈరోజు కురిసిన భారీ వర్షానికి శ్రీగాధ బ్రిడ్జి వద్ద భారీ చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందిన వెంటనే బీబీపేట పోలీస్ సిబ్బంది ఎం.ఏ. ఫైజ్, నవీన్ కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డుపై కూలిపోయిన చెట్లను తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బీబీపేట పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించి రాకపోకలను పునరుద్ధరించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.