జవహర్ నగర్‌లో గణేష్ మండపాల్లో అన్నప్రసాదం.. పాల్గొన్న నరేందర్ సర్కార్
జవహర్ నగర్: మేడ్చల్–మల్కాజ్‌గిరి పరిధిలోని కీసర సర్కిల్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని పలు గణేష్ మండపాలను జనసేన పార్టీ నాయకుడు నరేందర్ సర్కార్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయా మండపాల్లో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాల్లో నరేందర్ సర్కార్ పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మండపాల నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.
గణేష్ ఉత్సవాలను భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా ప్రశాంతంగా నిర్వహించాలని నరేందర్ సర్కార్ ఆకాంక్షించారు.
అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహిస్తున్న గణేష్ మండపాల నిర్వాహకులను ఆయన అభినందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.