పొలానికి వెళ్తుండగా పిడుగుపాటు.. ఫోన్లు పేలి ఇద్దరు రైతులకు గాయాలు
గాంధారి మండలంలో పొలం పనులకు వెళ్తున్న ఇద్దరు రైతులపై పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు పేలి గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొబ్బజివాడి గ్రామానికి చెందిన రైతులు మేకల సూర్యకాంత్, శంకర్లు గురువారం కురుస్తున్న వర్షంలో గొడుగులు పట్టుకుని వ్యవసాయ పొలాల వైపు బయలుదేరారు.
మార్గమధ్యంలో ఒక్కసారిగా వారిపై పిడుగు పడింది. పిడుగుపాటు తీవ్రతకు వారు పట్టుకున్న గొడుగులు ధ్వంసమవ్వడంతో పాటు, జేబుల్లో ఉన్న మొబైల్ ఫోన్లు పేలిపోయాయని స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు.
108 సిబ్బంది ప్రాథమిక చికిత్స
ఘటనా స్థలాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ సురేష్, పైలట్లతో కూడిన సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం ఇద్దరు రైతులను మెరుగైన వైద్యం కోసం గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.