బీబీపేట్‌లో సాధనశూరుల అద్భుత విన్యాసాలు.. జానపద కళల పరిరక్షణకు ప్రభుత్వ సహకారం అవసరం
బీబీపేట్: తెలంగాణ సంప్రదాయ జానపద కళల్లో ఒకటైన సాధనశూరుల విన్యాసాలు కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో ప్రజలను ఆకట్టుకున్నాయి. సోమవారం సాయంత్రం కాళికాదేవి భక్తులైన సాధనశూరులు ప్రదర్శించిన ఇంద్రజాలం, కనికట్టు, సాహస విన్యాసాలను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామం నుంచి వచ్చిన కళాకారులు తమ సంప్రదాయ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
జానపద కళలకు ప్రోత్సాహం అందించాలి: తుమ్మ మచ్చేందర్
ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ మాట్లాడుతూ.. బీబీపేట్ గ్రామస్తులు, పద్మశాలీయులు సాధనశూరుల కళలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని తెలిపారు. ప్రస్తుత తరానికి ఈ కళల గురించి పుస్తకాల ద్వారా తెలుసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అరుదుగా లభిస్తోందని పేర్కొన్నారు.
సాధనశూరులు గ్రామానికి వచ్చి తమ సంప్రదాయ కళలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కళలు గ్రామాలకే పరిమితం కాకుండా పట్టణాల్లోనూ ప్రదర్శించేలా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
ప్రభుత్వ సహకారంతోనే కళల పరిరక్షణ
అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న తెలంగాణ జానపద కళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని తుమ్మ మచ్చేందర్ కోరారు. కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందకపోతే ఈ సంప్రదాయ కళలు క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద కళాకారులను ఆదరించాలని, వారి కళలను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమానికి బీబీపేట్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంకాలం నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మ రవీందర్, మహిళా అధ్యక్షురాలు చందుపట్ల జమున, దుడుగు సంతోష్, చందుపట్ల శ్రీహరి, చింతకింది వేణు, చింత లింగం, క్యాతం శంకర్, దుడుగు గణేష్, అవధూత విఠల్‌తో పాటు పద్మశాలి సంఘం బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.
డిజిటల్ వార్తా పత్రికబీబీపేట్లో సాధనశూరుల విన్యాసాలు.. జానపద కళల పరిరక్షణకు పిలుపు
కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో సాధనశూరులు ప్రదర్శించిన సంప్రదాయ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ జానపద కళల పరిరక్షణకు ప్రభుత్వం సహకరించాలని తుమ్మ మచ్చేందర్ కోరారు.