బోడుప్పల్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

బోడుప్పల్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ చెంచర్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ కళ్యాణ్ కుమార్, పోగుల దిలీప్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన విధానం చిరస్మరణీయమని తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply