అసెంబ్లీ ఘటనపై జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్లకు BRS ఫిర్యాదు
అసెంబ్లీ ప్రాంగణంలో తమపై దాడి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరించిందని వారు ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్, మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని శుక్రవారం కలిశారు.
ఫోటోలు, వీడియోలు, ఆధారాలతో ఫిర్యాదు
ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడి తీరుకు సంబంధించిన ఫోటోలు, పేపర్ కటింగ్స్, వీడియోలు, ఇతర ఆధారాలను కమిషన్ ప్రతినిధులకు వివరించినట్లు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అనుచిత వైఖరిపై జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసి, వినతిపత్రాలు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్లను కోరినట్లు తెలిపారు.
పలువురు BRS నేతలు హాజరు
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది సోమ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం: అసెంబ్లీ ఘటనపై జాతీయ కమిషన్లకు BRS నేతలు ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఈ వార్తను ఇతరులతో షేర్ చేయండి.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.