ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత, ఐక్యూఏసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో ప్రిన్సిపాల్ డా. ఇ. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, ఐలమ్మ పోరాట స్ఫూర్తితో విద్యార్థినులు తమకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ఎదిరించాలని సూచించారు.
తెలుగు శాఖ అధ్యక్షుడు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. వి. శంకరయ్య మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చేశారని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. చంద్రకాంత్, టీఎస్‌కేసీ సమన్వయకర్త జంగం శివకుమార్, అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు, డా. గంగారెడ్డి, సంతోష్, శశిధర్, డా. గోదావరి, సురేష్ రెడ్డి, సంగీత, నరేష్ గౌడ్, కీర్తి స్వప్న, లక్ష్మణ్‌తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.