ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వానికిగాను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును స్వీకరించారు.
కేరళ రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ కేసీ వేణుగోపాల్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ఈ అవార్డును అందుకున్నారు.
దివంగత ఆర్యధాన్ ముహమ్మద్ గారు కేరళ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలందించారు. వారి జ్ఞాపకార్థం ఈ అవార్డును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందించడం జరిగింది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.