హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంవో అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికరాలను కూడా ముందుగానే కొనుగోలు చేసి, నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులను విధిగా సందర్శించాలని సూచించారు. వీటిపై జిల్లా స్థాయిలో ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని తెలిపారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సమావేశంలో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడులకు సంబంధించి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply