హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి జిల్లాల మియార్ లోయలో ఉన్న 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్ II శిఖరాన్ని అధిరోహించిన భారతీయ యాత్ర బృందంలో పాల్గొన్న తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విశాలవత్ బన్నీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సన్మానించారు.

ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్‌కు చెందిన పది మంది సభ్యుల భారతీయ యాత్ర బృందం మియార్ లోయలోని సాంకేతిక శిఖరమైన మౌంట్ తరంగ్ IIను విజయవంతంగా అధిరోహించినట్లు పేర్కొన్నారు.

ఈ యాత్రలో పాల్గొన్న విశాలవత్ బన్నీ పర్వత శిఖరంపై భారత జాతీయ త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాల ఫ్లెక్సీని ప్రదర్శించారు.

బన్నీ గతంలో కిలిమంజారో, కాంగ్ యత్సే II, లడక్ కైగర్ పర్వతాలను అధిరోహించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యా సొసైటీ గురుకులం కార్యదర్శి కె. సీతాలక్ష్మి IAS, అదనపు కార్యదర్శి నటరాజ్, జాయింట్ సెక్రటరీ డి.ఎస్. వెంకన్న, డిగ్రీ డీఎస్ డాక్టర్ వేణుగోపాల్ రావు, కామారెడ్డి గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి, పీడీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply