మహబూబాబాద్, అక్టోబర్ 3: హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వీరు కలిపి ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించారు.

సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు జరిగిన క్రీడా పోటీల్లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, ఓపెన్ సింగిల్స్‌లో రజత పతకం, ఓపెన్ డబుల్స్‌లో రజత పతకం సాధించారు.

పతకాలు సాధించిన ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ అక్టోబర్ 3న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పతకాలను పరిశీలించి వారిని అభినందించారు.

పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖకు గౌరవం తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ డా. శబరీష్ పేర్కొన్నారు.

పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. క్రీడల్లో మరింతగా రాణిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని డీఎస్పీలను ప్రోత్సహించారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply