ట్రాఫిక్ మెరుగుదలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల క్షేత్రస్థాయి పరిశీలన
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రాకపోకలను మరింత సులభతరం చేయడంతో పాటు రహదారి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించారు.
గౌలిదొడ్డిలో యూటర్న్‌లపై పరిశీలన
గౌలిదొడ్డి ప్రాంతంలో యూటర్న్‌లు, ట్రాఫిక్ రద్దీ పరిస్థితులను అధికారులు పరిశీలించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త యూటర్న్‌లు ఏర్పాటు చేయడం, అవసరం లేని యూటర్న్‌లను మూసివేయడం వంటి చర్యలపై సమీక్షించారు.
డెలాయిట్ వద్ద పికప్, డ్రాప్ ఏర్పాట్ల పరిశీలన
మాదాపూర్‌లోని డెలాయిట్ వద్ద ఉద్యోగుల పికప్, డ్రాప్ ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల ఎగ్జిట్‌ను ఫ్రంట్ గేట్‌కు మార్చాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు.
రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 8 మంది మార్షల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఫీనిక్స్ బిల్డింగ్ వద్ద ఫ్రీ లెఫ్ట్ కోసం కొలతలు
ఫీనిక్స్ బిల్డింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు శిల్పా ఫ్లైఓవర్ వైపు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన కొలతలను తీసుకున్నారు.
ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా సాగేందుకు, వాహనదారుల భద్రతను పెంచేందుకు అవసరమైన చర్యలను నిరంతరం చేపడుతున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.