దోమకొండలో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై కళాజాత అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వారపు సంతలో సోమవారం సాయంత్రం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై కళాజాత నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఐవి వ్యాపించే మార్గాలు, హెచ్‌ఐవి బాధితుల పట్ల వివక్షత రూపుమాపటం, హెచ్‌ఐవి నివారణ జాగ్రత్తల గురించి నందిని బృందం కళాజాత ద్వారా అవగాహన కల్పించింది.
కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, శివరాం మందిర్ ఆలయ కమిటీ చైర్మన్ కొండ అంజయ్య, ఐసిటిసి కౌన్సిలర్ మేక నాగరాజ్, లింకు వర్కర్ బాల్ కిషన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.