ఎల్లారెడ్డిలో గజేంద్ర సేన గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గల గజేంద్ర సేన గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్ మత్తా మాల భాగ్యవతి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కమీషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేశుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు.
పూజా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సొసైటీ వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్‌లను గణేష్ మండలి సభ్యులు శాలువతో సన్మానించారు. ఈ పూజ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.