ఎల్లారెడ్డి బాలికల పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి, క్రమశిక్షణ పెంపొందించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నికైన విద్యార్థులు
Student Council 2026వార్తా కథనం
LOCAL NEWSఎల్లారెడ్డి, ఆగస్టు 20 (పవార్ వార్త): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్సింలు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో హెడ్ గర్ల్స్‌గా అన్షరా మహావీన్, కె. అపర్ణ ఎన్నికయ్యారు. డిప్యూటీ హెడ్ గర్ల్స్‌గా ఏ. బిందుశ్రీ, బి. అవంతిక ఎన్నికయ్యారు.
అలాగే స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఆర్. కావేరి, స్పోర్ట్స్ వైస్ కెప్టెన్‌గా జె. వైష్ణవి ఎన్నికయ్యారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి, క్రమశిక్షణ పెంపొందించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించినట్లు పాఠశాల వర్గాలు తెలిపారు. ఎన్నికైన విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
హౌస్ కెప్టెన్లు
HOUSE LEADERSఎన్నికల దృశ్యాలు
PHOTO STORY

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


