ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మట్టి గణపతుల తయారీ
వినాయక చవితి పండగ సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏకో క్లబ్, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించడం వల్ల వాతావరణ కాలుష్య నివారణకు మంచిదని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలని, మత్తు పానీయాలు తీసుకోకుండా భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించాలని కోరారు.
మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈ సందర్భంగా మట్టి గణపతులు తయారు చేసిన విద్యార్థినీ విద్యార్థుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక కూడా జరిగింది.
మట్టి గణపతులు తయారు చేసిన విద్యార్థినీ విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ వి. శంకరయ్య, ఎకో క్లబ్ సమన్వయకర్త, ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ పీవో ఎస్. చంద్రకాంత్, ఏకో క్లబ్ మెంబర్ శశిధర్, ఎన్ఎస్ఎస్ యూనిట్-2 పీవో రాణి, టీఎస్‌కేసీ ఇన్చార్జి శివకుమార్, నాగనికా, సైన్స్ ఇన్చార్జి డాక్టర్ బి. అరుణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు ప్రభాకర్ రావు రావు, డాక్టర్ గంగారెడ్డి, కృష్ణ ప్రసాద్, డాక్టర్ ఎస్. గోదావరి, సంతోష్, స్వప్న, సురేశ్ రెడ్డి, మహమూద్, నరేష్ గౌడ్, పవన్, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.