ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. చంద్రకాంత్‌కు అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతి
ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం. చంద్రకాంత్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది.
ఈ మేరకు రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు, సిబ్బంది ఆయనను అభినందిస్తూ సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణతో పాటు ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ వి. శంకరయ్య, అధ్యాపకులు నాగానిక, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ గోదావరి, డాక్టర్ జి. సిద్ధురాజు, డాక్టర్ గంగారెడ్డి, కృష్ణ ప్రసాద్, సంతోష్, శశి కుమార్, సంగీత, మహమూద్, పవన్ కుమార్, నరేశ్ గౌడ్, సూపరింటెండెంట్ వసంత లక్ష్మి హరికృష్ణ, రవీందర్, భూషణం, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.