జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రథం.. గ్రామాలకు ఆహార సేవలు

కామారెడ్డి నియోజకవర్గంలో అన్నపూర్ణ రథం ద్వారా ఆహార పంపిణీ

పవార్ వార్త, కామారెడ్డి: నియోజకవర్గంలోని పేదలకు ఆహారం అందించాలనే లక్ష్యంతో జీసీఆర్ ట్రస్ట్ అన్నపూర్ణ రథాన్ని ప్రారంభించింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తల్లి గడ్డం విజయలక్ష్మి రథాన్ని ప్రారంభించారు.
గ్రామాల్లో పేదలకు ఆహార పంపిణీ
జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ రథం కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటించి పేదలకు ఆహారం అందించనున్నట్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని చెప్పారు.
ప్రజాసేవే లక్ష్యంగా ట్రస్ట్ కార్యక్రమాలు
అన్నపూర్ణ రథం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో రథం పర్యటించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందు ప్రియ, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, సబ్బాని కృష్ణహరి, డీసీసీ జనరల్ సెక్రటరీ జూలూరి సుధాకర్, సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు మెహర్ బాబాగౌడ్ పాల్గొన్నారు.
కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, సలీం, సుగుణ, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, జిల్లా పద్మశాలి అధ్యక్షుడు సిరిగాడ లక్ష్మీనారాయణ, రంగ రమేష్ గౌడ్, బండారి శ్రీకాంత్, కోటేశ్వర్, అరవింద్, ఆబిద్, యూత్ నాయకులు పండు శ్రీకాంత్, ఆకాష్, నిరంజన్, సేవాదళ్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి