గార్ల, అక్టోబర్ 9 (పవార్ వార్త):

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గార్ల పెద్ద చెరువు పరిధిలో వరి సాగు చేస్తున్న రైతులకు నీరు విడుదల చేయాలని, వ్యవసాయానికి ఆటంకంగా మారిన తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం, అఖిలపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం స్థానిక నెహ్రూ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టిన అనంతరం తహసీల్దార్, ఎంపీడీవో, విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.

సాగునీరు విడుదల చేయాలని డిమాండ్

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో ఖరీఫ్ పంటల సాగు ఇబ్బందుల్లో పడిందని నాయకులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లోనూ కొందరు పేద రైతులు ఆశతో వరి పంటలు సాగు చేశారని, పంటలు ఎండిపోకుండా గార్ల పెద్ద చెరువు నుంచి సాగునీరు విడుదల చేయాలని అధికారులను కోరారు.

తక్కువ వోల్టేజ్‌తో రైతులకు ఇబ్బందులు

విద్యుత్ సరఫరాలో తక్కువ వోల్టేజ్ సమస్యల కారణంగా మిర్చి, పత్తి, వరి పంటలకు నీరు అందించడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళనకారులు తెలిపారు. విద్యుత్ కోతల వల్ల గృహ వినియోగదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, సమస్యలను పరిష్కరించి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

అధికారులకు వినతిపత్రాలు

ఆందోళన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను తహసీల్దార్ శారద, ఎంపీడీవో ఎం. మంగమ్మ, విద్యుత్ శాఖ ఏఈ మధుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కందునూరి శ్రీనివాస్, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కట్టెబోయిన శ్రీనివాస్, గుగులోత్ సక్రుతో పాటు సీపీఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి, సీపీఎం 1వ వార్డు సభ్యులు లక్ష్మీ శెట్టి పూర్ణచర రావు, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గడ్డిపాటి రాజారావు, వంగూరి వెంకటేశ్వర్లు, జె. వెంకన్న, డి. కై బాబు, కె. రామకృష్ణ, మిగడ శ్రీను, జి. వీరభద్రం, ఎస్. రాజు యాదవ్, టీ. నాగేశ్వరావు, సీహెచ్ గణేష్, మనోహర్, డి. సక్రు, ఎం. అశోక్, ఎం. రాములు, శ్రీనాథ్, మహేష్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply