గార్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గార్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గార్ల ఎస్సై సాయి కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది
అనంతరం ఎస్సై సాయి కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరయ్య, హెడ్ దాసు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.