ఎల్లారెడ్డి, అక్టోబర్ 9 (పవార్ వార్త): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. కళాశాలకు నేటితో చివరి పనిదినం కావడంతో ప్రత్యేకంగా ఈ వేడుకలను ప్రారంభించారు.
కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సతీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస చారి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకుడు సతీష్, గణిత అధ్యాపకురాలు విశాల, జువాలజీ అధ్యాపకుడు రమేష్, బోటనీ అధ్యాపకుడు రాకేష్, కామర్స్ అధ్యాపకుడు సుమన్, ఫిజిక్స్ అధ్యాపకుడు నాగయ్య, కెమిస్ట్రీ అధ్యాపకుడు శైలూ పాల్గొంటున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వేడుకలు నిర్వహిస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


