జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి: దాదాన్నగారి విఠల్ రావు డిమాండ్
జర్నలిస్ట్ బస్వరాజు పై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్ రావు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా అనేది ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ నిరంతరం వారధిగా పనిచేస్తూ, నిజాలను వెలికితీసే వ్యవస్థ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలపై వాస్తవ కథనాన్ని అందించినందుకు గాను, స్టాఫ్ రిపోర్టర్ బస్వరాజు పై కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని ఆయన అన్నారు.
ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం నిజానిజాలను పరిశీలించి, అసత్య ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలే తప్ప, వాస్తవాలను రాసే విలేకరులపై కేసులు పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. బస్వరాజు పై మోపిన కేసులను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో పాత్రికేయులపై ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.