జూరాల పరిసరాల్లో హై టెన్షన్.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్
జూరాల డ్యాం పరిసరాల్లో రైతులు, బీఆర్ఎస్ పార్టీ ఆందోళనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనలకు మద్దతుగా డ్యాం పైన ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు.
డ్యాం పరిసరాల్లో సుమారు 12 కిలోమీటర్ల పరిధి నుంచి డ్యాం మీదివరకు పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు వాహనాలను అడ్డంగా ఉంచి తనిఖీలు నిర్వహించారు. ఆత్మకూరు–గద్వాల రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
ఉదయం నుంచి బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు
ఆందోళనల నేపథ్యంలో ఉదయం నుంచి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నందిమల్ల క్రాస్ రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోడ్లకు అడ్డంగా కట్టెలు, రాళ్లు పేర్చి పోలీసు వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారు.
పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.