కీసర ORRలో భారీ ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న XUV 700
కీసర ORR మార్గంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. DRDO–యాదగిరిగుట్ట మధ్యలో శామీర్‌పేట్ నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన XUV 700 కారు ఢీకొట్టింది.
ప్రమాదంలో XUV 700 కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారు నుజ్జునుజ్జయిన దృశ్యాలు వెలువడ్డాయి. ప్రమాదంలో అలేటి శిరీష్ కుమార్ మృతి చెందినట్లు తాజా సమాచారం.
మృతుడు అలేటి కిష్టయ్య కుమారుడు అలేటి శిరీష్ కుమార్ (38)గా వివరాలు వెల్లడయ్యాయి. ఆయన CCTV కెమెరా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నట్లు, వనస్థలిపురం A111 ఫేజ్-1 కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొన్న కారు
DRDO–యాదగిరిగుట్ట మధ్యలో శామీర్‌పేట్ నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్‌ను XUV 700 కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.