కుత్బుల్లాపూర్‌లో శ్రీ అయి మాత 611వ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ డివిజన్‌లో శ్రీ అయి మాత 611వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ శ్రీ అయి మాతాజీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ అయి మాతాజీ ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
శ్రీ అయి మాత 611వ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న శిరివి సమాజ్, జీడిమెట్ల నిర్వాహకులను కూన శ్రీశైలం గౌడ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.