ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొడంగల్‌లో బీఆర్‌ఎస్ నిరసన
కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొడంగల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎమ్మెల్యే శంకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుద్యాల్ మండలం బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు లగచర్ల సురేష్ ముదిరాజ్, మడిగే శ్రీనివాస్, బొబ్బిలి నరేందర్, ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు ఏరోనిపల్లి శ్రీనివాస్, రుద్రారం శ్రీనివాస్, మాసాని వెంకటయ్య, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.