బస్వాపూర్ కేజీబీవీ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన
జుక్కల్ మండల కేంద్రంలోని బస్వాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించిన సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, సరదాగా ముచ్చటించారు. విద్యార్థినులకు స్టీల్ స్టోరేజ్ బాక్సులు, షూస్, టవల్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థినులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాలికల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.