కామారెడ్డి, అక్టోబర్ 3: ముదిరాజ్‌లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, జీవో 6ను వెంటనే అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర పిలుపు మేరకు ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ముదిరాజ్‌లకు ప్రతి గ్రామంలో మూడు ఎకరాల భూమి, పండ్లు, పలహారాలు పెట్టుకునేందుకు, వాటిపై ఆధారపడి జీవనం సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే గ్రామాల్లోని కుంటలు, చెరువులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయాలని నరసింహులు కోరారు. కొన్ని గ్రామాల్లో ముదిరాజ్‌ల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కుంటలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో బెస్తవాళ్లు ఉండటం కారణంగా తమకు సభ్యత్వం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.
కుంటలు, చెరువుల్లో చేప పిల్లల పెంపకం, చేపల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్‌లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ముదిరాజ్‌లు కుంటలు, చెరువులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ చేప పిల్లలు వేసే విషయంలో ప్రభుత్వ ఒత్తిడి ఉంటుందనే భయాందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు.
కుంటలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో ముదిరాజ్‌లకు చేపల పెంపకం, జీవనోపాధికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

