నాగారంలో 100 మట్టి వినాయకుల పంపిణీ
నాగారం, సెప్టెంబర్ 13:
వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నాగారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ధరణి నగర్ కాలనీ ఫేస్–2లో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్–5లో ఉన్న సాయి ధరణి నగర్ కాలనీ ఫేస్–2 కమ్యూనిటీ హాల్ వద్ద ఆదివారం సుమారు 100 మట్టి వినాయక విగ్రహాలను కాలనీ ప్రజలకు అందజేశారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) ఈఈ శ్రీ రాజేందర్ ఈ విగ్రహాలను అందజేశారు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు.
మట్టి వినాయక విగ్రహాలను అందించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ రాజేందర్‌కు కాలనీ అధ్యక్షుడు గొలుసుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పులవర్తి శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయి ధరణి నగర్ కాలనీ ఫేస్–2కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణహితమైన మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.