నాగారంలో అమ్మవార్ల ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
నాగారం, సెప్టెంబర్ 6: శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్ల ఆలయ ప్రస్తుత కమిటీ పదవీకాలం ముగియడంతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం డా. బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో ఆలయ ధర్మకర్తలు, కుల పెద్దలు, బస్తీ పెద్దలు, కాలనీవాసుల సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన, పూజా కార్యక్రమాలు, జాతరలు, పండుగలు, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. అనంతరం అందరి సమ్మతితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎర్రి ఉషయ్య, ఉపాధ్యక్షుడిగా బొల్లారం బాలనర్సింహా, కార్యదర్శిగా అనుపాటి శ్రవణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా పంగ కుమార్, కోశాధికారిగా నిమ్మల రవి ఎన్నికయ్యారు. ఆర్గనైజర్లుగా ఎర్ర యాదగిరి, ఎర్ర లింగం, ఎల్దూరి రమేష్‌లను ఎన్నుకున్నారు.
సమావేశంలో ఆలయ ధర్మకర్తలు, కుల పెద్దలు ఎర్ర ఉషయ్య, పంగ హరిబాబు, బాబు ఎల్దూరి తదితరులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ కౌన్సిలర్ పంగ హరిబాబు పాత, నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు.
మాజీ అధ్యక్షుడు ఎల్దూరి మల్లేష్ నూతన కమిటీకి అభినందనలు తెలిపి, ఆలయ కమిటీ వద్ద ఉన్న రూ.50,659 నగదును నూతన కమిటీకి అప్పగించి బాధ్యతలను బదలాయించారు.
అమ్మవార్ల ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ పూజా కార్యక్రమాలు, జాతరలు, పండుగలు, ప్రత్యేక ఉత్సవాలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి కాలనీవాసులు, భక్తులు ఐకమత్యంతో సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో పంగ ముత్యాలు, నిమ్మల కృష్ణ, ఏర్పల శంకరయ్య, ఎల్దూరి ఆంజనేయులు, పంగ యాదగిరి, పంగ శ్రీహరి, కిష్టన్నగారి లింగం, ఏర్పల అశోక్, ఎర్ర మహేష్, ఎర్ర వామన్‌రావు, ఎర్ర విద్యాసాగర్, కిష్టన్నగారి రవి, కొండపాక రఘుపతి తదితరులు పాల్గొన్నారు.