మార్షల్ ఆర్ట్స్‌లో రాణించిన విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అయిండ్ల లితునా, విరాజ్ హర్ష మార్షల్ ఆర్ట్స్‌లో రాణించడంతో ఆదివారం సదాశివనగర్ మండల టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు కాలాలి సాయగౌడ్ వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా కాలాలి సాయగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతో పాటు ఆటలు, పాటలు, నృత్యం వంటి రంగాల్లోనూ రాణించాలని అన్నారు. చిన్ననాటి నుంచే కుంఫులో శిక్షణ పొందుతూ, కూచిపూడి నృత్యంలోనూ ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం ద్వారా జిల్లాకు, మండలానికి, గ్రామానికి కీర్తి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అయిండ్ల శ్వేత, రాజులకు జన్మించిన అయిండ్ల లితునా హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు సిల్వర్ మెడల్ సాధించిందని తెలిపారు.
భారత్ ఆర్ట్స్ అకాడమీ నృత్యకారులతో నిర్వహించిన కూచిపూడి నృత్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుందని చెప్పారు. అలాగే విరాజ్ హర్ష కుంఫులో గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించడం సంతోషకరమని అన్నారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పలువురికి ఆదర్శంగా నిలవడం సంతోషకరమని కాలాలి సాయగౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల టి.ఆర్.ఎస్ మహిళా అధ్యక్షురాలు ఉప్పల్ వాయ్ సంధ్య, సోషల్ మీడియా ఇన్‌చార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మన్, సడిమేలా నర్సింలు, అస గాలయ్య తదితరులు పాల్గొన్నారు.