నాగారం డివిజన్‌లో మట్టి వినాయకుల పంపిణీ
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో మట్టి వినాయకుల ప్రతిమలను పెద్ద సంఖ్యలో పంపిణీ చేశారు. బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి PVR (పోతంశెట్టి వెంకటేశ్వరరావు) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా PVR మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP)తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా శ్రేష్ఠమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను అందరూ పూజించాలనే ఉద్దేశంతో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఇక ముందు కూడా వినాయక విగ్రహాల తయారీదారులు శ్రేష్ఠమైన మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.
పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో బిజ్జ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మామిడి జంగా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వల్లాల శ్రీనివాస్, కర్ర వెంకటేశ్వర్, సీనియర్ నాయకులు సూర్య శేఖర్ రెడ్డి, సెక్రటరీ సురేందర్ రెడ్డి, శైలజ, సతీష్ కుమార్, గోపాల్‌తో పాటు RSS కార్యకర్తలు, వివిధ కాలనీ హిందూ సంఘాల నాయకులు, సోదరీ సోదరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.