చార్జింగ్‌లో ఉండగా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలి దగ్ధం
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో చార్జింగ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి కలాన్ గ్రామానికి చెందిన రోడ్డ వెంకట్ సుమారు పది నెలల క్రితం ఏడీఏఎంఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశారు. వెంకట్ కుమార్తె భాగ్యలక్ష్మి నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తోంది.
శుక్రవారం భాగ్యలక్ష్మి ఎలక్ట్రిక్ స్కూటీపై మెడికల్ షాపుకు వచ్చి అక్కడ వాహనాన్ని పార్క్ చేసింది. సాయంత్రం స్కూటీని చార్జింగ్‌లో ఉంచగా.. కొద్దిసేపటికే వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాద సమయంలో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలను సేకరించారు.
స్కూటీ బ్యాటరీ పేలడానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.