జవహర్ నగర్‌లో జోనల్ కమిషనర్ పర్యటన.. కాలనీల సమస్యలపై చర్యలకు ఆదేశాలు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్‌లో మల్కాజిగిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచి గంగావర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఆమె పరిశీలించారు.

కమిషనర్ వెంట స్థానిక సీనియర్ బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ బాబు పలు కాలనీల్లోని సమస్యలను చూపించారు. వాటిని పరిష్కరించాలని కోరారు.

ఓపెన్ నాలాల నిర్మాణానికి చర్యలు

భక్తబాయి, న్యూ వెంకటేశ్వర కాలనీ, ముత్తుస్వామి కాలనీల్లో ఉన్న ఓపెన్ నాలాల నిర్మాణాన్ని విడతల వారీగా చేపడతామని కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.

లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ ఎదురుగా ఓరిని పూడ్చివేసి నీరు వెళ్లకుండా నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వాటిని తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని స్థానిక అధికారులను ఆమె ఆదేశించారు.

ప్రధాన సమస్యలకు విడతల వారీగా నిధులు

జవహర్ నగర్‌లో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి విడతల వారీగా ప్రభుత్వ నిధులు కేటాయిస్తామని కమిషనర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్న కాలనీల్లోని సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కమిషనర్ ఆకస్మిక పర్యటనపై ఆయా కాలనీల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె వెంట నడుస్తూ తమ ప్రాంతాల్లోని సమస్యలను కమిషనర్‌కు వివరించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply