నెక్కొండలో బైక్ చోరీకి యత్నం.. నిందితుడిని పట్టుకున్న స్థానికులు
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని మసీదు వద్ద బైక్ చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మసీదు ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గమనించినట్లు సమాచారం.
వెంటనే స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. బైక్ చోరీ యత్నాన్ని గుర్తించి నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికుల సమయస్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.