హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఫిర్యాదు
ఎల్లారెడ్డి: హమారా ప్రసాద్‌పై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి మండల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. హమారా ప్రసాద్ తరచుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ పుస్తకం రాస్తున్నట్లు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో బహిరంగంగా చెప్పారని వారు పేర్కొన్నారు.
హమారా ప్రసాద్ చేస్తున్న చర్యల వెనుక కుట్ర దాగి ఉందని సంఘం నాయకులు ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని పేర్కొంటూ, ఆయనను కించపరిచేలా మాట్లాడిన హమారా ప్రసాద్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కనిరాం, సంఘం బాధ్యులు నౌషా, వినోద్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.