గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

200 సీసీ కెమెరాల పర్యవేక్షణ

నగరంలోని ప్రధాన రహదారులు, నిమజ్జన మార్గాలు, విగ్రహాల తరలింపు ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ఏర్పడే ప్రదేశాలు, నిమజ్జన కేంద్రాల వద్ద పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించినట్లు పోలీస్ కమీషనర్ కార్యాలయం తెలిపింది.

ప్రజలు, ఉత్సవ కమిటీలకు సూచన

ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి

WhatsApp Facebook Telegram X (Twitter) Gmail LinkedIn Instagram
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply