కామారెడ్డి: పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
రిపోర్టర్: పవహార్ యశ్వంత్ రావు
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. లైన్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.