నర్సింగ్ రావు పేట్ వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు
రిపోర్టర్:దసరా సిద్ధు
బాచుపల్లి సమీపంలోని నర్సింగ్ రావు పేట్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట నుంచి నర్సింగ్ రావు పేట్ వైపు వెళ్తున్న మార్గంలో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న రవి అనే వ్యక్తి రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే రవి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతమంది స్థానికులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అయితే గాయపడిన వ్యక్తి కొంతసేపు నేషనల్ హైవేపైనే ఉండిపోయినట్లు స్థానికులు తెలిపారు.
గాయపడిన రవి రేగోడు మండలం దుద్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారు డ్రైవర్ పరిస్థితి, రవి ఆరోగ్య పరిస్థితి, అలాగే ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.