రాయదుర్గ్ వక్ఫ్ భూమి పరిరక్షణకు ఐఎఫ్‌టీయూ మద్దతు
హైదరాబాద్: రాయదుర్గ్‌లోని జామియా నిజామియా వక్ఫ్ భూమిని వేలం వేయాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 13న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు ఐఎఫ్‌టీయూ సంఘీభావం ప్రకటించింది. వక్ఫ్ బచావో తహ్రీక్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాకు తమ మద్దతు ఉంటుందని భారత కార్మిక సంఘాల (ఐఎఫ్‌టీయూ) జాతీయ కార్యదర్శి షేక్ షావలి తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జేఏసీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు సంపూర్ణ నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు.
రాయదుర్గ్‌లోని జామియా నిజామియా వక్ఫ్ భూముల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించాలని షేక్ షావలి సూచించారు. వెంటనే భూముల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు మద్దతు కోరిన షేక్ షావలి
వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ముస్లిం మైనారిటీల విద్య, ఉపాధి, ఇతర సామాజిక వర్గాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా వక్ఫ్ భూముల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజల మద్దతు, ఐక్యత అవసరమని పేర్కొన్నారు.
వక్ఫ్ బచావో తహ్రీక్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అబ్దుల్ వహాబ్ నాయకత్వంలో కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని షేక్ షావలి పిలుపునిచ్చారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.