రేపల్లె ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ స్పందించాలని బీఎస్పీ డిమాండ్

జోగులాంబ గద్వాల్ జిల్లా: గద్వాల్ మండలం రేపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు స్పందించారు. జిల్లా అధ్యక్షుడు మణికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాసన్నతో పాటు పార్టీ జిల్లా నాయకులు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఇద్దరు మేజర్లు పరస్పర ఇష్టంతో వివాహం చేసుకున్న నేపథ్యంలో ఏర్పడిన సమస్యను హైదరాబాద్ పోలీసులు పరిష్కరించినప్పటికీ, అనంతరం అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేశారని తెలిపారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొన్నారు.

కులం, లింగం, వర్ణం, మతం ఆధారంగా వివక్షకు చోటు ఉండకూడదని పృథ్వీరాజ్ అన్నారు. బాధిత కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేసిన ఘటనపై బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పందించి రేపల్లె గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి నెల 30వ తేదీన గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని బీఎస్పీ నాయకులు కోరారు. దీని ద్వారా ప్రజలకు రాజ్యాంగ, పౌర హక్కులపై అవగాహన పెంచి కుల వివక్షను తగ్గించే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఇంటిని పునర్నిర్మించి ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని, వారి ధన, మాన, ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడు మణికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్ అబ్రహం, మాజీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, జిల్లా నాయకులు శాంతిరాజ్, దేవన్న, నరేష్, గోవింద్, దుబ్బన్న, బొల్లి కురుమయ్య, దాసరి అశోక్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply