జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియమితులైన పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని కలిసిన చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. నూతన బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడిగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందారు. నూతన డీసీసీ అధ్యక్షుడిగా ఆయన నియామకంతో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.