ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై సమీక్ష: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం
హైదరాబాద్
హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం – SC/ST (Prevention of Atrocities) Act, 1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరగనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ చట్టం అమలుపై స్టేట్ లెవల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి.
ఈ సమావేశంలో రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షించి చర్చించనున్నారు. అలాగే చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరుపైనా చర్చ జరగనుంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.