ఎల్లారెడ్డిలో ఎస్‌డీఎఫ్ నిధులతో పలు వార్డుల్లో పనులు ప్రారంభం
ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఎస్‌డీఎఫ్ నిధులతో పలు వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డి ఏడవ వార్డులో ముదిరాజ్ సంఘం కోసం రూ.5 లక్షలతో, పదవ వార్డులోని మదర్సా కోసం రూ.2 లక్షలతో పనులు మొదలుపెట్టినట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎమ్మెల్యేకు తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి ఈ నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు పనులు ప్రారంభమయ్యాయి. ఈ అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. జగ్జీవన్, వైస్ చైర్మన్ మత్తమాల భాగ్యవతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.