సీతారాం ఏచూరి పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలు: సీపీఎం నేతలు
మార్క్సిస్ట్ నేత, సీపీఎం పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి, పూర్వ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని గార్లలో సీపీఎం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మంగపతి రావు భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి మాట్లాడుతూ సీతారాం ఏచూరి పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తామని అన్నారు.
లౌకిక విలువలు, భారతదేశంలో సోషలిజం సాధన, తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఏచూరి కట్టుబడి ఉన్నారని వారు పేర్కొన్నారు. పార్లమెంట్‌లోనూ, బయటా ప్రజా సమస్యలపై పోరాడిన యోధుడిగా ఆయనను అభివర్ణించారు.
మతోన్మాద ప్రమాదంపై, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏచూరి అలుపెరగని పోరాటం చేశారని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, శ్రామిక రాజ్యం సాధన కోసం పోరాటం చేయడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.